గతంలోనూ చిరంజీవిని టార్గెట్ చేస్తూ, పవన్‌కల్యాణ్‌ని పై కెత్తుతూ ట్వీట్స్ చేసి వివాదం కోరి తెచ్చుకున్న వర్మ మరోసారి ట్విట్టర్ ద్వారా జనాలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. చిరు కంటే సంపూ బెటర్ అంటూ కామెంట్ చేశాడు. ఇది చిరంజీవి అభిమానులకు కోపం తెప్పిస్తోంది. సంపూతో మా హీరోకు పోలికేంటి? అని వారు అంటున్నారు. ఆయన ట్వీట్ చేస్తూ... సంపూ... ది ఓన్లీ హీరో, రియల్ హీరో అంటూ ప్రశంసిస్తూ, సూపర్‌స్టార్స్ అమితాబ్‌బచ్చన్, రజనీకాంత్, చిరంజీవిల కంటే సంపూ బెటర్ అని ట్విట్టర్‌లో పోస్ట్‌చేశాడు. ‘కొబ్బరిమట్ట’లోని సంపూ పాడిన పాట అదుర్స్ అన్న వర్మ... ఈ బర్నింగ్‌స్టార్‌ని ఆకాశానికెత్తేస్తున్నాడు. త్వరలో సంపూతో వర్మ ఓ సినిమా చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.