మన స్టార్‌హీరోలకు తమ సరసన ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉంటే గానీ నిద్రపట్టదు. ప్రేక్షకులు కూడా వాటికి అలవాటైపోయారు. అయితే టాలీవుడ్‌లో స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ విషయానికి వస్తే ఆయన నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ తప్ప మిగిలిన చిత్రాలన్నీ సోలో హీరోయిన్‌తో చేసినవే. అందుకే ఆయనకు అలాంటి ముద్ర లేదు. ఆయనొక్కడే ఈ విషయంలో మినహాయింపు. ఇప్పుడు మరోసారి ఆయన నారి నారి నడుమ మురారి అనబోతున్నాడు బోయపాటిశ్రీను దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా గీతాఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్న చిత్రం స్టోరీ ఇద్దరు హీరోయిన్లను డిమాండ్ చేస్తోందని, కథ డిమాండ్ దృష్ట్యా ఇద్దరు హీరోయిన్లు తప్పదు అంటున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరి కోసం వేట కొనసాగుతోంది...!