మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో గానీ ఆయన చిత్రంపై రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. ఈ చిత్రాన్ని ఆయన తనయుడు రామ్‌చరణ్ నిర్మించనున్నాడు అనేది ఒక్కటే ఇప్పటికీ క్లారిటీ ఉన్న ఒకే ఒక్క అంశం. పలు దర్శకుల పేర్లు చాలా వినపడుతున్నాయి. అయితే తాజాగా పూరీజగన్నాథ్ పేరు విస్తృతంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పూరీ చిరుని కూడా సిక్స్‌ప్యాక్‌లో చూపించనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ అదే పనిలో ఉన్నాడని, ఇంతకు ముందు పలువురు హీరోలను సిక్స్‌ప్యాక్‌లో చూపించిన పూరీ తాజాగా చిరంజీవిని కూడా అదే తరహాలో సరికొత్తగా ప్రెజెంట్ చేయడానికి సంసిద్దుడు అవుతున్నాడు అని అలాగే ఈ చిత్రంలో చిరు సరసన అతిలోక సుందరి శ్రీదేవి నటించనుందని ఫిల్మ్‌నగర్ టాక్....!