స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ సినిమాలకు తెలుగులోనే కాదు... మలయాళంలోనూ మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన గత చిత్రాలు అక్కడ మంచి వసూళ్లు సాధించాయి. తాజాగా అల్లుఅర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం మలయాళంలో ఏప్రిల్ 24న అక్కడ విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతోంది. తెలుగులో ఈ చిత్రానికి మొదటిరోజు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ మలయాళంలో ఈ చిత్రానికి మొదటి షో నుండి పాజిటివ్ టాక్ రావడం గమనార్హం. దీంతో అల్లుఅర్జున్ పేరు ‘మల్లు’ అర్జున్‌గా మారుమోగిపోతోంది. అల్లుఅర్జున్‌తో పాటు ఉపేంద్ర, నిత్యామీనన్ తదితరులు నటించడంతో అవి కూడా ఈ చిత్రానికి అక్కడ ప్లస్‌పాయింట్స్ అయ్యాయి. కేరళలోని అల్లుఅర్జున్ ఫ్యాన్స్ సినిమాకు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ సినిమాతో అల్లుఅర్జున్ క్రేజ్ మలయాళంలో రెట్టింపయిందని చెప్పవచ్చు.