తెలుగు హీరోల్లో ఒకరైన శ్రీకాంత్ త్వరలో తన తనయుడు రోషన్‌ని వెండితెరకు హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించబోతుండటం విశేషం. సన్‌షైన్ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ల సంయుక్త నిర్మాణంలో పి.రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. శ్రీకాంత్-ఊహ దంపతులకు ముగ్గురు సంతానం. కుమారులు రోషన్, రోహన్‌లతో పాటు కుమార్తె మేథ ఉన్నారు. పెద్దకొడుకు రోషన్ వయసు 20ఏళ్లకు తక్కువే ఉంటుంది. అతన్ని క్యూట్ లవ్‌స్టోరీ ద్వారా వెండితెరకు హీరోగా పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి పి.రామ్మోహన్ స్వయంగా దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది....!