క్రియేటివ్‌జీనియస్ మణిరత్నం సరైన హిట్టుకొట్టి దాదాపు 10ఏళ్లు కావస్తోంది. ఈమద్యకాలంలో ఆయనకు కనీసం ఊరటనిచ్చే చిత్రం కూడా రాలేదు. కానీ దాదాపు పదేళ్ల తర్వాత ఆయన ‘ఓకే బంగారం’ చిత్రం అద్భుతమైన విజయం నమోదు చేసుకుంటోంది. ఈ చిత్రంతో మణిరత్నం మరలా ఫామ్‌లోకి వచ్చేశాడు. దీంతో ఆయన గాలిలో తేలిపోతున్నాదు. ఇక ఆయన తదుపరి చిత్రం ఏమిటి? అనే విషయం ఇప్పుడు అందరిలో హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. సహజీవనం వంటి సెన్సిటివ్ సబ్జెక్ట్‌ను తీసుకొని అలాంటి కథను జనరంజకంగా తీర్చిదిద్దడంలో ఆయన అద్బుత ప్రతిభ చూపించాడు. దీంతో ఆయనకు కలెక్షన్లతో పాటు ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. కాగా ఇదే చిత్రాన్ని ఆయన హిందీలో తీయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం హిందీలోకి రీమేక్ కావడం ఖాయమైంది కానీ దానికి మణిరత్నమే దర్శకత్వం వహిస్తాడో లేదో అనే విషయం మాత్రం కన్‌ఫర్మ్ కాలేదు. మరోవైపు ఆయన తన తదుపరి చిత్రంగా తమిళ స్టార్ ధనుష్ హీరోగా కోలీవుడ్, బాలీవుడ్లలో ఒక చిత్రం చేయనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ధనుష్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక మణిరత్నం కూడా ఓ సబ్జెక్ట్‌కు కనీసం ఏడాది సమయం తీసుకుంటాడు. సో.. అది వెంటనే తేలే విషయం కాదని, మణి తదుపరి చిత్రానికి చాలా టైముందని అంటున్నారు.