Advertisementt

రజనీ మౌనముద్ర!

Sun 26th Apr 2015 01:16 PM
rajinikanth,lingaa,chiranjeevi,political parties  రజనీ మౌనముద్ర!
రజనీ మౌనముద్ర!
Advertisement
Ads by CJ

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘లింగ’ వచ్చి నాలుగు నెలలు దాటిపోతోంది. అయితే ఇప్పటికీ రజనీ తన తదుపరి చిత్రం విషయంలో మౌనముద్ర దాలుస్తున్నాడు. చిరంజీవి 150వ చిత్రం విషయంలోలాగానే రజనీ కూడా తన తదుపరి చిత్రం విషయంలో స్పష్టత ఇవ్వడంలేదు. మీడియాలో మాత్రం రజనీకాంత్‌ తన తదుపరి చిత్రంగా శంకర్‌ దర్శకత్వంలో ‘రోబో2’ చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో కమల్‌ లేదా విక్రమ్‌లు విలన్‌గా నటిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. తన తదుపరి చిత్రంపై ఇన్ని వార్తలు వస్తున్నా...రజనీ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ‘లింగ’ చిత్రం విషయంలో నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌, డిస్ట్రిబ్యూటర్ల తీరు పట్ల రజనీ బాగా బాధపడుతున్నాడని, ఆ పరిణామాలు సున్నితమనస్కుడైన రజనీని ఇప్పటికీ బాధిస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. అందరూ తనను వాడుకొని వదిలేసే ఓ డబ్బు యంత్రంలా చూడటం పట్ల రజనీ మనస్తాపానికి గురవుతున్నాడని, కొందరు రాజకీయ నాయకుల వైఖరి వల్లే ఇంతటి ఆందోళన జరిగిందనే నిర్ణయానికి రజనీ వచ్చాడట. అందుకే తన తదుపరి చిత్రం విషయంలో రజనీ ఇప్పటికీ ఏమీ తేల్చుకోలేకపోతున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ