యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించే సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 14 నుండి విదేశాలలో ప్రారంభమవుతుంది. లండన్‌లో లొకేషన్ల వేట పూర్తయింది. యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. తొలుత మే 1 నుండి రెగ్యులర్ షూటింగ్ జరపాలని సన్నాహాలు చేశారు. ఓ 14 రోజులు లేటుగా ఫస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది.
తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపధ్యంలో సాగే కథకు 'మా నాన్నకు ప్రేమతో..' అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. చిత్ర బృందం ఇంకా దృవీకరించలేదు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఇమేజ్, సుకుమార్ స్టైల్ కలయికలో డిఫరెంట్‌గా ఈ చిత్రం రూపొందనుంది.