Advertisementt

తెలుగు సినిమాలపై సెటైర్లు వేసిన తేజ!

Sat 25th Apr 2015 08:41 AM
director teja,telugu cinema stories,teja satire on telugu movies,teja movies  తెలుగు సినిమాలపై సెటైర్లు వేసిన తేజ!
తెలుగు సినిమాలపై సెటైర్లు వేసిన తేజ!
Advertisement
Ads by CJ

తెలుగు సినిమా కథలన్నీ ఒకే చట్రం చుట్టూ తిరుగుతున్నాయనేది కాదనలేని సత్యం. విమర్శకులే కాదు... దర్శకులు కూడా ఈ మాటని అంగీకరిస్తున్నారు. సాక్షాత్తు దర్శకుడు తేజనే సినిమా కథలపై ఓ సెటైర్‌ వేశాడు. ఆయన మాట్లాడుతూ... మన దగ్గర రెండే కథలున్నాయి. వాటినే తిప్పి తిప్పి చూపిస్తున్నాం. హీరో ఓ ఊర్లో చిన్నా చితకా పనులు చేసుకుంటూ బుద్దిమంతుడిలా బతికేస్తుంటాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో మనోడు పెద్దతోపుగాడని, రాయలసీమలో పెద్ద పోటుగాడని తెలుస్తుంది. రెండో కథ... ఏమిటంటే హీరో విలన్‌ ఇంట్లో తిష్ఠ వేస్తాడు. వాడి కూతుర్ని ప్రేమిస్తాడు. ఇంటర్వెల్‌లో ఓ ట్విస్ట్‌. హీరోకి, విలన్‌కు పాత గొడవలుంటాయి. అందేంటనేది సెకండాఫ్‌లో చూపిస్తారు. ఇలాంటి కథలు తప్ప మనం కొత్తవి రాసుకోం. చిన్న సినిమాల్లోనే కొత్త కథలుంటాయి. వాటిని మనం పట్టించుకోము... అంటూ తెలుగు సినిమాపై తనదైన రీతిలో సెటైర్లు వేశాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ