Advertisementt

ధనుష్‌కు తండ్రిగా సీనియర్‌ డైరెక్టర్‌!

Sat 25th Apr 2015 08:36 AM
hero dhanush,ks ravikumar,father role,linga movie  ధనుష్‌కు తండ్రిగా సీనియర్‌ డైరెక్టర్‌!
ధనుష్‌కు తండ్రిగా సీనియర్‌ డైరెక్టర్‌!
Advertisement
Ads by CJ

తమిళ సీనియర్‌ డైరెక్టర్‌ కె.యస్‌.రవికుమార్‌కు తెరపై కనిపించడం అంటే మహా సరదా...! ఇలా కనిపించి అలా మాయమయ్యే పాత్రల్లో కనిపిస్తుంటాడు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లింగ’ చిత్రంలో ఫినిషింగ్‌ కుమార్‌గా దర్శనమిచ్చాడు. ఇప్పుడు ఆయన మరో పాత్రలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. అయితే అది అతిథి పాత్ర కాదు. పుల్‌లెంగ్త్‌ రోల్‌. ధనుష్‌కు తండ్రిగా కనిపించనున్నాడు కె.ఎస్‌.రవికుమార్‌. ‘విఐపి’ ఫేమ్‌ వేల్‌రాజ్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో ధనుష్‌కి తండ్రిగా రవికుమార్‌ అయితే బాగుంటుందని భావించిన చిత్రం బృందం ఆయన్ని సంప్రదిస్తే పాత్ర నచ్చడంతో ఓకే చెప్పాడట. ఇందులో రవికుమార్‌కి జోడీ కూడా ఉంది.ఈ పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ రాధిక నటిస్తోంది. ఈ చిత్రంలో సమంత, ఏమీజాక్సన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ