Advertisementt

‘ఉత్తమవిలన్‌’కు ఆర్ధికసమస్యలు!

Sat 25th Apr 2015 05:20 AM
uttama villain,financial problems,kamal haasan,c kalyan  ‘ఉత్తమవిలన్‌’కు ఆర్ధికసమస్యలు!
‘ఉత్తమవిలన్‌’కు ఆర్ధికసమస్యలు!
Advertisement
Ads by CJ

కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఉత్తమవిలన్‌’ను మే1న విడుదల చేయనున్నట్లు ప్రచారం కూడా మొదలుపెట్టారు. తమిళంతోపాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదలకు రంగం సిద్దమైంది. అయితే ఈ చిత్రానికి తమిళంలో ఆర్ధికసమస్యలు చుట్టుముట్టాయని కొలీవుడ్‌ మీడియా సమాచారం. అయినా యూనిట్‌ మాత్రం మే1న విడుదల చేయడానికి యుద్దప్రాదిపదికన కష్టపడుతున్నారు. ఇప్పటికే పలు వివాదాలను ఎదుర్కొంటున్న ఈ సినిమాకు తాజాగా ఇలా ఆర్థికసమస్యలు చుట్టుముట్టడం అందరినీ  ఆందోళనకు గురిచేస్తోంది. మొత్తానికి ఏప్రిల్‌ చివరి వారం కల్లా ఈ ఆర్ధికసమస్యలను పరిష్కరించకపోతే ఇక ఈ సినిమాను వాయిదా వేయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని ట్రేడ్‌వర్గాల భోగట్టా. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో సి.కళ్యాణ్‌ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ