గత సంవత్సరం ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ నటించబోయే 'గబ్బర్ సింగ్2' కు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. వచ్చే నెల నుండి ఖచ్చితంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని చిత్రబృందం వెల్లడించింది. దీంతో 'గబ్బర్ సింగ్2' సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్న పవన్ అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు అనుకోని మరో విపత్తు ఏర్పడింది. నిన్న ఢిల్లీలో జరిగిన రాజకీయ పరిణామాల ప్రకారం కేంద్రప్రభుత్వం లోక్ సభలో ఒక ప్రకటన చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కి స్పెషల్‌స్టేటస్ ఇవ్వలేమంటూ తేల్చేసింది. కొద్ది రోజుల క్రితం పవన్ తన ట్విటర్ లో ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని కేంద్రప్రభుత్వానికి గుర్తు చేసాడు.
మరి ఇప్పుడు కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పవన్ ఎలా స్పందిస్తాడు..? దీని కోసం పవన్ ఉద్యమాలేమైనా చేస్తాడా..? లేక మౌనంగా తను అనుకున్నట్లు సినిమా షూటింగ్ మొదలు పెడతాడా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ పవన్ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించకపోతే 'జనసేన' పార్టీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతాడు. ఈ విషయంపై పవన్ తీవ్రమైన ఆలోచనలో ఉన్నాడని సమాచారం.