వివాదాస్పద అంశాలపై సినిమాలు తీయడంలో రాంగోపాల్ వర్మ అందరికన్నా ముందుంటారు. ఇప్పుడు కమల్ కూడా వర్మను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. తనకున్నదంతా ఊడ్చిపెట్టి మరీ ఆయన 'విశ్వరూపం' సినిమాను నిర్మించాడు. ఆ సినిమా విడుదలకు తెలంగాణలో చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ముస్లిం మతం స్ఫూర్తిని దెబ్బతీసేలా సన్నివేశాలున్నాయంటూ సినిమా విడుదలను నిలిపివేయడంతో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మరో వివాదాస్పద అంశాన్ని సినిమాగా తీయాలని కమల్ నిర్ణయించుకున్నారు. 1968లో తమిళనాడులోని 'కిళవెనమణి' గ్రామంలో 40 మంది దళితుల్ని అగ్రవర్ణాలవారు ఊచకోత కోసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దక్షిణ భారత్‌లో తమిళనాడులో ఉన్న కుల గజ్జి మరే రాష్ట్రంలో కూడా ఉండదు. ఈ నేపథ్యంలో కిళవెనమణి ఘటన స్ఫూర్తిగా కమల్ 'ఉళ్లేన్ అయ్యా' అనే సినిమాను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ వ్యవస్థలో ఉన్న కుల పోరాటాన్ని ఈ సినిమాలో కమల్ ప్రస్తావించనున్నారు. తమిళనాడులో అత్యంత సున్నితమైన అంశంపై తీస్తున్న ఈ సినిమాతో తాను జైలుపాలు కూడా అయ్యే అవకాశం ఉందని కమల్ చెబుతున్నారు..