Advertisementt

‘లయన్‌’కు గడ్డు పరిస్థితి!

Fri 24th Apr 2015 11:26 AM
lion movie,director ramanarao,dilraju  ‘లయన్‌’కు గడ్డు పరిస్థితి!
‘లయన్‌’కు గడ్డు పరిస్థితి!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ నటించిన ‘సింహా, లెజెండ్‌’ చిత్రాలు సూపర్‌హిట్టు అయ్యాయి. ఇంత సూపర్‌హిట్టు అయిన ‘లెజెండ్‌’కు నైజాంలో వచ్చింది కేవలం ఆరేడు కోట్లేనట...! వాస్తవానికి నైజాంలో బాలయ్య చాలా వీక్‌ అని ట్రేడ్‌వర్గాలు కూడా చెబుతున్నాయి. దీంతో ఆయన చిత్రాలు నైజాంలో ఎక్కువరేట్లు పలకవు. తాజాగా ‘లయన్‌’ చిత్రాన్ని కూడా నైజాంలో కొనడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. దీంతో ఈ చిత్రాన్ని దిల్‌రాజు చేతికి అప్పగించాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన దిల్‌రాజు ‘లయన్‌’ను కొనడానికి ముందుకొచ్చాడట....! కాకపోతే మరీ తక్కువ రేటును ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాత రుద్రపాటి రమణారావుకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురవుతోందిట...! మరో రెండు మూడు రోజుల్లో ఎవరు కొనడానికి ముందుకురాకపోతే ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు అప్పగించడం మినహా ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ