Advertisementt

ఆ నిర్మాతల్లో నేను లేనంటోన్న బండ్లగణేష్‌!

Fri 24th Apr 2015 05:11 AM
bandla ganesh,film industry,dil raju,telugu film producers controversy  ఆ నిర్మాతల్లో నేను లేనంటోన్న బండ్లగణేష్‌!
ఆ నిర్మాతల్లో నేను లేనంటోన్న బండ్లగణేష్‌!
Advertisement
Ads by CJ

కొన్నిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో  ఓ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. తెలుగు నిర్మాతల మండలికి చెందిన 14మంది పెద్ద నిర్మాతల గ్రూప్‌ ఓ మూడు న్యూస్‌ చానెల్స్‌కు మాత్రమే ప్రకటనలు ఇవ్వాలని, మిగిలిన వారికి ఇవ్వాల్సిన అవసరం లేదనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి దిల్‌రాజు నేతృత్వం వహిస్తున్నాడని అందరూ చెప్పుకొంటున్నారు. దిల్‌రాజు నేతృత్వంలోని ఆ 14మంది నిర్మాతల గ్రూప్‌లో బండ్ల గణేష్‌ కూడా ఉన్నట్లు ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో బండ్లగణేష్‌ వివరణ ఇచ్చాడు. సదరు 14మంది నిర్మాతల గ్రూప్‌లో నేను లేనని  ఆయన స్పష్టం చేశాడు. మీడియా చానెల్స్‌పై తనకు ఎలాంటి వివక్ష లేదని, వారిపట్ల తానెలాంటి వివక్ష చూపించడం లేదని, మీడియా మిత్రులంతా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ లాంటి వారు అని స్పష్టం చేశాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ