ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు అంటారు. కానీ ఇది సమంత విషయంలో నిజం కాదని తెలుస్తోంది. సమంత హీరోలనే కాదు... తనతోటి హీరోయిన్లను కూడా మాయచేస్తోంది. సమంతతో కలిసి ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో కలిసి నటించిన నిత్యామీనన్, ఆదాశర్మలు సమంతను తమ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వారితో పాటు ‘అత్తారింటికిదారేది, రభస’ చిత్రాల్లో తనతో కలిసి నటించిన ప్రణీతను కూడా తన స్నేహంలో ముంచెత్తుతోంది. సమంత తన బెస్ట్ ఫ్రెండ్ అని అంటోంది నిత్యామీనన్. ప్రణీత కూడా తన బెస్ట్ ఫ్రెండ్, తమ బెస్ట్ కో స్టార్ సమంతనే అని అంటోంది. సమంతతో ఇగో సమస్యలు ఉండవని ఆమెతో కలిసి ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కలిసి నటించిన ఆదాశర్మ అంటోంది. వీరే కాదు.. ‘బృందావనం’ చిత్రంలో తనతో నటించిన కాజల్‌కు కూడా బెస్ట్ ఫ్రెండ్ సమంతనే అట...!ఇలా కొత్త హీరోయిన్లతోనే కాదు... తన సీనియర్ల చేత కూడా బెస్ట్ అని కాంప్లిమెంట్స్ పొందుతోన్న సమంత అందరితో మరి రిలేషన్‌షిప్ మెయిన్‌టెయిన్ చేసుకున్నందుకు ఆమెను అభినందించి తీరాల్సిందే...!