పెద్ద పెద్ద స్టార్‌హీరోల సినిమాలు విడుదలకు సిద్దంగా ఉంటే చిన్న సినిమాలు వాయిదా వేసుకుంటారు. కానీ ఈమధ్య టాలీవుడ్‌లో స్టార్‌హీరోల చిత్రాల రిలీజ్‌లో కన్‌ఫ్యూజన్ ఎక్కువవుతోంది. దీంతో చిన్న సినిమాల నిర్మాతలు అయోమయంలో పడుతున్నారు. క్లారిటీ కన్నా కన్‌ఫ్యూజన్ ఎక్కువవుతోంది. చెప్పేది ఒక డేటు విడుదలయ్యేది మరో డేట్‌కు అనే పరిస్థితి ఏర్పడుతోంది. అల్లుఅర్జున్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 2న విడుదల అన్నారు. చివరకు ఆ చిత్రం వారం ఆలస్యంగా విడుదలైంది. ఇక మే 1వ తేదీన బాలకృష్ణ ‘లయన్’ వస్తుందని చెప్పారు. అది ఓ వారం ఆలస్యంగా మే 7న మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మే 7న అనుకున్న రవితేజ ‘కిక్2’ ‘లయన్’ దెబ్బకు మరో వారం ఆలస్యం కానుంది. ఇలా ఒక్క సినిమా లేటయితే ఆ ఎఫెక్ట్ మిగతా అన్ని సినిమాలపై పడుతోంది. ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ చిత్రాల విషయంలో కూడా విడుదలపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇక మహేష్-కొరటాల శివ చిత్రం కూడా జులైలో మాత్రమే విడుదలవుతుందని అంటున్నారు.