మహేష్‌బాబు నటించిన ‘ఖలేజా’ సినిమా కాన్సెప్ట్ ‘దైవం మానుష్య రూపేణ’. ప్రస్తుతం మహేష్‌బాబు అదే మార్గంలో నడుస్తున్నాడు. దేవుడిలా ఓ సంస్థను ఆదుకున్నాడు. ఆరోగ్యం, విద్య... ఇలా కనీస సౌకర్యాలు అందక విలవిలలాడే పిల్లలకు చేదోడు వాదోడుగా పని చేసే ‘హీల్డ్ చైల్డ్’ అనే సంస్థకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సంస్థకు తాజాగా కోటిన్నర రూపాయల విరాళం ప్రకటించాడు. అయినా తాను చేసిన పనికి ఏమాత్రం పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. ఇక నుండి తన ఆదాయంలో 30శాతం ఈ సంస్థకు కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. మొత్తానికి మహేష్ గుప్తదానం చూసి అందరూ ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.