నిషేధానికి గురైన క్రికెటర్ శ్రీశాంత్ ఓ తెలుగు చిత్రంలో నటించడానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ‘స్నేహగీతం’ ఫేమ్ మధుర శ్రీధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో శ్రీశాంత్ హీరోగా నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగష్టులో ప్రారంభం కానుంది. షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మంచి సందేశంతో పాటు వినోదాత్మకంగా తెరకెక్కించనున్నారని సమాచారం.