Advertisementt

కొందరు హీరోలకే పరిమితమై పోతున్న త్రివిక్రమ్‌!

Thu 23rd Apr 2015 06:21 AM
trivikram srinivas,mahesh babu,pawan kalyan,alluarjun  కొందరు హీరోలకే పరిమితమై పోతున్న త్రివిక్రమ్‌!
కొందరు హీరోలకే పరిమితమై పోతున్న త్రివిక్రమ్‌!
Advertisement
Ads by CJ

దర్శకుడు అన్న తర్వాత అందరి హీరోలతో పనిచేసి మెప్పించాలి. కానీ టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడిగా పేరుతెచ్చుకున్న త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ మాత్రం కొందరు హీరోలకే పరిమితం అవుతున్నాడు. రచయితగా ఉన్నప్పుడు చిరంజీవి నుండి తరుణ్‌ వరకు అందరితో పని చేసిన ఆయన దర్శకుడిగా మారిన తర్వాత మొదటి సినిమాను తరుణ్‌తో చేశాడు. కానీ ఆ తర్వాత మాత్రం కేవలం పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు, అల్లుఅర్జున్‌లకే పరిమితమై పోయి వారితోనే రెండేసి చిత్రాలు చేశాడు. రాబోయే చిత్రాన్ని కూడా పవన్‌ లేదా మహేష్‌లతోనే చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాడు. సాదారణంగా రాజమౌళి మాత్రం మొదట కథ రాసుకొని ఆ తర్వాత ఆ కథకు తగ్గ హీరోను తీసుకుంటాడు. కానీ త్రివిక్రమ్‌ స్టైల్‌ డిఫరెంటు. ముందుగా హీరోని కమిట్‌ అయి ఆ తర్వాత అతనికి తగ్గ విధంగా స్టోరీని తయారుచేసుకుంటూ ఉంటాడు. మరి త్రివిక్రమ్‌ ఇతర హీరోలతో పనిచేసేది ఎప్పుడో అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి వారి కల నెరవేరుతుందో లేదో చూడాల్సివుంది....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ