బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ ప్రస్తుతం ‘ఫితూర్’ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ చిత్రం ద్వారా తొలిసారిగా కత్రినా ఆదిత్యరాయ్‌కపూర్ కలిసి ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం సరికొత్త సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోందని ఇందులో ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు భిన్నంగా చూపించబోతున్నారు. అంతేకాకుండా ఇందులో కత్రినా గుర్రం స్వారీ చేస్తూ కనిపిస్తుందిట. గుర్రంస్వారీ చేయడం ఆమెకు చాలా కష్టం అవుతోందని యూనిట్ సభ్యులు అంటున్నారు. షూటింగ్‌లో భాగంగా కత్రినా గుర్రం స్వారీ చేస్తుండగా ఓ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయినట్లు తెలుస్తోంది. రైడిరగ్ చేస్తుండగా ఆమె బ్యాలెన్స్ కోల్పోయింది. దాదాపుగా కింద పడిపోయిన వెంటనే యూనిట్ సభ్యులే స్పందించడంతో గాయాలు ఏవీ కాకుండా తప్పించుకొందని ఓ ఆంగ్ల పత్రిక కథనం. తర్వాత ఆమె ఏమాత్రం భయపడకుండా ...ధైర్యం కోల్పోకుండా కత్రినా మళ్లీ గుర్రం ఎక్కి షూటింగ్ పూర్తి చేసిందట. గుర్రం స్వారీ చేసే సన్నివేశాలు భిన్నంగా ఉండనున్నాయి. ‘ఫితూర్’ చిత్రానికి అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తుండగా, నటి రేఖ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.