Advertisementt

త్రివిక్రమ్‌కే ఆ బేనర్‌ అంకితమా !

Wed 22nd Apr 2015 07:25 AM
trivikram srinivas,julaayi,radhakrishna producer,harika and haasini creations  త్రివిక్రమ్‌కే ఆ బేనర్‌ అంకితమా !
త్రివిక్రమ్‌కే ఆ బేనర్‌ అంకితమా !
Advertisement
Ads by CJ

హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మాతగా ఇప్పటివరకు త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి’ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కేవలం త్రివిక్రమ్‌ మాటకు విలువ ఇస్తూ ఈ బేనర్‌ను స్థాపించినట్లు రాధాకృష్ణ తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ఈ బేనర్‌లో మూడో చిత్రంగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలోనే మహేష్‌బాబు లేదా అక్కినేని అఖిల్‌ హీరోగా సినిమాను నిర్మించాలని నిర్మాత యోచన చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉందని, ఈ బేనర్‌లో కేవలం త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ దర్శకత్వంలోనే సినిమాలు తీస్తాడట నిర్మాత రాధాకృష్ణ, కాగా త్వరలో రాదాకృష్ణ నిర్మాతగా అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా తీయనున్నాడు. ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌పై కాకుండా మరో బేనర్‌లో తీయడానికి ఆయన సిద్దం అవుతున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ