సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ నయనతార కెరీర్ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఇప్పుడు ఆమెకు తమిళంలో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆమె దాదాపు అరడజను తమిళచిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్టులలో ఆమె కూడా ఒకరు. ఇటీవల చెన్నైకి చెందిన ఓ జ్యూవలరీ బ్రాండ్ ఆమెను ప్రచారకర్తగా నియమించుకోవడానికి సంప్రదించారట. ఆమెతో ఓ కమర్షియల్ యాడ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఇందుకోసం రెండు రోజుల షూటింగ్‌కు డేట్స్ అడిగారు. మొత్తం ఈ డీల్‌కుగాను నయన 4కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నయనతారకు ఉన్న డిమాండ్, క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆమె అడిగిన మొత్తం ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు తమిళ సినిమా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది....!