సునీల్ కెరీర్‌కు ఏమైంది.? అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్నా సునీల్ కెరీర్ గాడి తప్పడానికి కారణం ఎవరు? ఇప్పుడు ఆయన ఇన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఏడాదికి ఒక్కటి కూడా రావడం లేదు. ఇప్పట్లో ఆయన కెరీర్ మరలా గాడిలో పడటం కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు. కమెడియన్‌గా ఉన్నప్పుడు ఏడాదికి 20 నుండి 25 సినిమాల్లో నటించాడు. ఆయన కాల్షీట్స్ కోసం ఎందరో ఎగబడ్డారు. అయితే ‘అందాలరాముడు’తో హీరోగా మారినప్పటికీ ఆ తర్వాత కూడా సునీల్ కామెడీ పాత్రలు కూడా చేస్తూ బిజీగా కనిపించాడు. అయితే ఎప్పుడైతే రాజమౌళి ‘మర్యాదరామన్న’ చిత్రం చేశాడో... అక్కడి నుండి సునీల్ కెరీర్ పడిపోయింది. వాస్తవానికి సునీల్‌కు స్నేహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక కామెడీ వేషాలు వదిలేయమని, హీరోగానే సెటిల్ అవ్వమని సునీల్‌కు సలహా ఇచ్చాడట...! దానికి రాజమౌళి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు డైరెక్టర్ల సూచన మేరకు సునీల్ కేవలం హీరోగానే నటించాలని నిర్ణయం తీసుకోవడం ఆయనకు పెద్ద సమస్యగా మారింది. ఇలా కొందరి సలహాలు విన్న సునీల్ ఎటూ కాకుండా పోతున్నాడు...పాపం....!