టాలీవుడ్‌లో శ్రీహరి మరణించిన ఏడాదిన్నర అయినప్పటికీ ఆ స్థానం ఇప్పటివరకు అలాగే ఖాళీగా ఉండిపోయింది. మొదట్లో అందరూ ఆ స్థానాన్ని జగపతిబాబు పూడుస్తాడని భావించారు. కానీ జగపతిబాబు కూడా శ్రీహరి స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయడంలో వెనుకపడ్డాడు. శ్రీహరి లాంటి సపోర్టింగ్‌రోల్ చేసే వారు కరువయ్యారు. ఇటీవలే ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఉపేంద్ర కీలకపాత్రను చేసి ఓకే అనిపించుకున్నాడు. వాస్తవానికి ‘ఢీ, కింగ్’, ‘నువ్వొస్తానంటే ... నేనొద్దంటానా’ వంటి చిత్రాల్లో శ్రీహరి చేసిన మాస్ కామెడీ చేయడంలో జగపతిబాబు చాలా వీక్ అనే చెప్పాలి. ఇక ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో పోషించిన పాత్రల వంటి వాటిని ఉపేంద్ర ఒప్పుకుంటూ వెళితే మాత్రం ఉపేంద్రకు ఇలాంటి పాత్రలు మరిన్ని వస్తాయి. గతంలో శ్రీహరి బతికున్నప్పుడు ఆయన కోసమే రచయితలు కొన్ని పాత్రలు సృష్టించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. శ్రీహరి లాంటి పాత్ర ఆల్‌రెడీ ఉంటే వాటిని జగపతిబాబు చేత చేయిస్తున్నారు. మరి ఆ స్థానం భర్తీ చేసేవారు ఎవరో? ఎప్పుడు భర్తీ చేస్తారో వేచిచూడాల్సివుంది....!