తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించాక సినిమా పరిశ్రమను అభివృద్ధి చేస్తామని ఎవరికీ వారే యూనియన్స్ అని పార్టీ లని ఏర్పాటు చేస్తున్నారు. రీసెంట్ గా తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన వర్గ కార్యదర్శులు వీళ్ళే అని మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రెసిడెంట్ గా ఎన్నికైన వ్యక్తి ఎన్నో వాగ్దానాలు కూడా చేసేసారు. అయితే అసలు ఎన్నికలు ఎవరి సమక్షంలో జరిగాయి. అసలు జరిగాయా..? లేదా..?. ఇది ఇలా ఉంటే ఇది జరిగిన మరునాడు రెండు మూడు వర్గాలు మీటింగ్ లు ఏర్పాటు చేసి మేము అంటే మేమంటూ తెలంగాణా సినిమా అధికారం కోసం పాకులాడడం తెలిసిన విషయమే. అయితే ఇప్పటివరకు తెలంగాణా సినిమాకు సంబంధించి ఏర్పాటైన అన్ని యూనియన్స్ పై సినిమాటోగ్రఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు శ్రీశైలం యాదవ్ లు ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణా సినిమాకు సంబంధించి పూర్తి క్లారిటిని ఇవ్వనున్నారు.
మే1 న మే డే సందర్భంగా ఏడువేల మంది సమక్షంలో జరగనున్న కార్యక్రమంలో తెలంగాణా సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవ్వనున్నాయని సమాచారం. సో.. ఇప్పటికైనా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న తెలంగాణా సినిమా యునియన్లకు సంబంధించిన పూర్తి క్లారిటీ వస్తుందని ఆశిద్దాం.