Advertisementt

'ఒక్క రాత్రి'లో కమల్ యాక్షన్ థ్రిల్లర్..?

Tue 21st Apr 2015 02:06 PM
kamalhasan,action thriller,trisha,prakash raj  'ఒక్క రాత్రి'లో కమల్ యాక్షన్ థ్రిల్లర్..?
'ఒక్క రాత్రి'లో కమల్ యాక్షన్ థ్రిల్లర్..?
Advertisement
Ads by CJ

ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ కమల్ హాసన్. బహుశా భారతీయ సినీ చరిత్రలో కమల్ హాసన్ చేసినన్ని ప్రయోగాలు మరొక హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు. వయసు మీరుతున్న కొద్ది కమల్ ఆలోచనల్లో కొత్తదనం పెరుగుతుంది. దశావతారం, విశ్వరూపం, ఉత్తమ విలన్.. గత దశాబ్ద కాలంలో కమల్ రాసిన కథలన్నీ వైవిధ్యమే. తాజాగా అలాంటి కథకు కమల్ శ్రీకారం చుడుతున్నారని సమాచారం. 

జేమ్స్ బాండ్ చిత్రాల తరహాలో స్వీయ నిర్మాణంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందించడానికి కమల్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళంలో 'ఒరే ఇరువు' అనే టైటిల్ ఖరారు చేశారు. తెలుగులో ఒక్క రాత్రి అని అర్ధం. దానిని బట్టి కథంతా ఒక్క రాత్రిలో జరిగిన అంశం చుట్టూ తిరుగుతుందని అర్ధమవుతుంది. చిత్రం కూడా ఒక్క రాత్రిలో ముగుస్తుందా..? లేదా..? అనేది చూడాలి. మారిషస్ లొకేషన్లలో ఈ చిత్ర షూటింగ్ చేయనున్నారు. కమల్ అసిస్టెంట్ దర్శకత్వం వహిస్తారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో, త్రిష కథానాయికగా నటిస్తారని సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ