Advertisementt

రామ్ చరణ్ సిస్టర్ భలే చెప్పింది..!

Tue 21st Apr 2015 01:59 PM
krithi kharbanda,theenamaar,ramcharan,sister role  రామ్ చరణ్ సిస్టర్ భలే చెప్పింది..!
రామ్ చరణ్ సిస్టర్ భలే చెప్పింది..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సరసన 'తీన్ మార్' సినిమాలో నటించిన కృతి కర్బందా, శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రామ్ చరణ్ సిస్టర్ పాత్రలో నటిస్తుంది. హీరోయిన్‌గా నటించిన మీరు సిస్టర్ పాత్రలో నటించడానికి మొదట సంశాయించారా..? అని అడిగితే భలే సమాధానం చెప్పింది.

నిజం చెప్పాలంటే, సిస్టర్ క్యారెక్టర్ నా కెరీర్ పై ఎటువంటి ప్రభావం చూపుతుందని పెద్దగా ఆలోచించలేదు. క్యారేక్టరైజేషన్ నచ్చడంతో ఓకే చెప్పాను. కన్నడలో పెద్ద స్టారయిన ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తిలో చిన్న పాత్రలో నటించారు. ఆ పాత్రలో ఎందుకు నటించారని అడిగాను. మనం సినిమా చేసిన తర్వాతే తెలుస్తుంది, సరైన నిర్ణయమా..? కాదా..? అనేది. మనపై నమ్మకంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అంత పెద్ద హీరో చేసినపుడు, నేను సిస్టర్ పాత్రలో ఎందుకు నటించకూడదని ఎదురు ప్రశ్నిస్తుంది. కృతి తెలివైన సమాధానం విని ఔరా అనుకుంటున్నారు సినీ జనాలు. 


తెలుగులో కృతి నటించిన ఒక్క సినిమాకు హిట్ కాలేదు, రెండేళ్ళ నుండి తెలుగులో అవకాశాలు రాలేదు. సిస్టర్ పాత్ర రావడం గొప్ప విషయమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.    
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ