Advertisementt

సూర్య మగ దెయ్యం!

Tue 21st Apr 2015 06:37 AM
suriya,new movie maas,horrer comedy film,director venkat prabhu  సూర్య మగ దెయ్యం!
సూర్య మగ దెయ్యం!
Advertisement
Ads by CJ

హర్రర్‌,కామెడీ జోనర్‌ సినిమాలు విరివిగా వస్తున్నాయి. అయితే ఓ స్టార్‌ హీరో ఇలాంటి కథని ఎంచుకోవడం నిజంగా  కొత్తే. ఆ ధైర్యం చేశాడు తమిళ స్టార్‌ హీరో సూర్య. ఆయన నటిస్తున్న చిత్రం ‘మాస్‌’. ఓ హర్రర్‌ కామెడీ కథ. వెంకట్‌ ప్రభు దర్శకుడు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని మే 15న విడుదలకు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో దెయ్యం కూడా సూర్యానేనట...! దెయ్యం సినిమాల్లో దెయ్యం అంటే అది ఖచ్చితంగా ఆడదెయ్యమే అయ్యుంటుంది. కాగా ఈ ‘మాస్‌’ చిత్రంలో మాత్రం మగదెయ్యంగా సూర్య భయపెట్టబోతున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ