సాధారణంగా ‘లెజెండ్’ వంటి సూపర్‌హిట్ తర్వాత బాలకృష్ణ నటించే చిత్రం అంటే సినిమా బిజినెస్ హాట్‌కేకుల్లా అమ్ముడుపోవాలి. బయ్యర్లు ‘లయన్’ చిత్రాన్ని ఫ్యాన్సీరేట్లకు ఎగబడాలి. కానీ ‘లయన్’ విషయంలో ఇది జరగడం లేదని దీంతో నిర్మాత చాలా టెన్షన్‌తో ఉన్నట్లు సమాచారం. బయ్యర్ల హడావుడి లేకపోవడం... ఫ్యాన్సీ రేటు ఊసేలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొత్త దర్శకుడు, నిర్మాత కావడం.... ఒక సూపర్‌హిట్ తర్వాత వరుసగా రెండు మూడు ఫ్లాప్‌లు ఇవ్వడం బాలయ్యకు ఉన్న సెంటిమెంట్ కారణంతోనే ఇలా జరుగుతోందని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. కొన్ని ఏరియాల్లో బిజినెస్ జరిగినప్పటికీ గీకి గీకి బేరమాడి తక్కువ రేటుకే కొనుకున్నారు. ఈ ఎఫెక్ట్ ‘లయన్’పై పెద్దగా ఎఫెక్ట్ చూపిస్తోంది. శాటిలైట్ హక్కులు కూడా కేవలం 6.5కోట్లకు మాత్రమే అమ్ముడయ్యాయి. ముఖ్యంగా ఒక సూపర్‌హిట్ తర్వాత రెండు మూడు భారీ ఫ్లాప్‌లు అనే బాలయ్య సెంటిమెంట్ మాత్రం బయ్యర్లను బాగా భయపెడుతోంది.