Advertisementt

అల్లు అర్జున్‌ కేరళ ప్రయాణం..!!

Mon 20th Apr 2015 11:47 PM
allu arjun,son of satya murthy,kerala  అల్లు అర్జున్‌ కేరళ ప్రయాణం..!!
అల్లు అర్జున్‌ కేరళ ప్రయాణం..!!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్‌ నటించిన తాజా చిత్రం 'సన్నాఫ్‌ సత్యమూర్తి' కలెక్షన్లపరంగా దూసుకెళ్తోంది. మొదట ఈ సినిమాకు నెగిటీవ్‌ టాక్‌ వచ్చినప్పటికీ.. మరే ఏ స్టార్‌ హీరోల సినిమాలు లేకపోవడానికితోడు మెల్లిమెల్లిగా ప్రేక్షకులు 'సన్నాఫ్‌ సత్యమూర్తి' ఇప్పుడు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 40 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక కేరళలో కూడా అల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా విడుదలైన 'సన్నాఫ్‌ సత్యమూర్తి' విజయం సాధించింది. దీంతో అక్కడ ఈ సినిమాకు మరింత ఊపు తీసుకురావడానికి ఏప్రిల్‌ 21న అల్లు అర్జున్‌ కేరళ వెళ్లనున్నట్లు సమాచారం. ఇక 'సన్నాఫ్‌ సత్యమూర్తి' తర్వాత అల్లు అర్జున్‌ తన నెక్స్ట్‌ సినిమా మీద దృష్టిపెట్టాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ తన తదుపరి సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ