మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కోసం మెగాఫ్యామిలీకి చెందిన హీరోలు ఇప్పటివరకు 6లక్షల విరాళం అందించారు. రామ్‌చరణ్ 2లక్షలు, అల్లుఅర్జున్ 2లక్షలు, వరుణ్‌తేజ్ లక్ష, సాయిధరమ్‌తేజ్ లక్ష విరాళం అందించారు. రాజేంద్రప్రసాద్ ప్రమాణ స్వీకారం సందర్భంగా నాగబాబు ఇందుకు సంబంధించిన చెక్‌ను రాజేంద్రప్రసాద్‌కు అందించారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతూ కోట్లు సంపాదిస్తున్న ఇతర హీరోలు కూడా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌కు విరాళాలు ఇవ్వడం ద్వారా పేద కళాకారులకు సహాయం చేసిన వారవుతారని పలువురు ఆర్టిస్టులు అభిప్రాయపడుతున్నారు.