Advertisementt

శృతికి కోర్టు బెడద తప్పినట్లే..!!

Mon 20th Apr 2015 02:12 PM
sruthi hasan,picturehouse,court case  శృతికి కోర్టు బెడద తప్పినట్లే..!!
శృతికి కోర్టు బెడద తప్పినట్లే..!!
Advertisement
Ads by CJ

శృతిహాసన్‌కు ఊరట దక్కింది. ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన కేసుకు సంబంధించి రాజీ కుదిరింది. పిక్చర్‌ హౌస్‌ నిర్మాణ సంస్థకు, శృతిహాసన్‌లకు నడుమ విబేధాలు వచ్చి విషయం కోర్టు దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. పిక్చర్‌ హౌస్‌ సంస్థ నాగార్జున, కార్తిలతో ఓ మల్టీస్టారర్‌ చిత్రం నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా శృతిని ఎంచుకున్నారు. అయితే మొదటి షెడ్యూల్‌ కూడా గడిచిన తర్వాత ఈ సినిమానుంచి శృతి తప్పుకోవడంతో సదరు నిర్మాణ  సంస్థ కోర్టుకు వెళ్లింది. దీంతో తమ అనుమతి లేకుండా శృతిహాసన్‌ కొత్త సినిమాలను అంగీకరించవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె ఇరకాటంలో పడ్డారు. చివరకు తెలుగు, తమిళ్‌ సినీ పెద్దలు రంగంలోకి వారికి రాజీ కుదర్చారు. పెద్దల జోక్యంతో వెనక్కి తగ్గిన పిక్చర్‌ హౌస్‌ కేసును ఊపసంహరించుకోవడానికి అంగీకరించింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ