Advertisementt

‘లయన్‌’కు పోటీగా చిన్న చిత్రం!

Mon 20th Apr 2015 09:33 AM
lion movie,saivam thamil movie,remake,dagudumuthala dandakore,krish  ‘లయన్‌’కు పోటీగా చిన్న చిత్రం!
‘లయన్‌’కు పోటీగా చిన్న చిత్రం!
Advertisement
Ads by CJ

అచ్చమైన తెలుగు చిత్రాలు ఎప్పుడో గానీ రావు. ‘సీతారామయ్యగారి మనవరాలు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఉయ్యాల జంపాల’ వంటి చిత్రాలు  ఎప్పుడో వస్తుంటాయి. అయితే తమిళంలో వచ్చిన ‘శైవం’ చిత్రానికి రీమేక్‌గా వస్తోన్న ‘దాగుడుమూతల దండాకోర్‌’ చిత్రం మాత్రం పేరుకు తమిళ రీమేక్‌ అయినా, కేవలం మెయిన్‌పాయింట్‌ను మాత్రమే తీసుకొని, మిగిలిన మొత్తం చిత్రాన్ని అచ్చతెలుగు చిత్రంగా రూపొందించారని ట్రయిలర్స్‌, ఆడియో వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు క్రిష్‌ సమర్పిస్తుండగా, రామోజీరావు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం మొత్తం పంపిణీహక్కులను దిల్‌రాజు సొంతం చేసుకున్నాడు. దిల్‌రాజు తీసుకోవడంతో ఈ చిత్రానికి ఇక థియేటర్ల సమస్య ఉండదని అర్థం అవుతోంది. ఈ చిత్రాన్ని మే 1వతేదీన విడుదలకు సిద్దం చేస్తున్నారు. కాగా అదే రోజు బాలకృష్ణ నటించిన ‘లయన్‌’ చిత్రం కూడా విడుదల కానుంది. బాలయ్య చిత్రానికి మాస్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తే తమ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆదరిస్తారని ‘దాగుడుమూతల దండాకోర్‌’ యూనిట్‌ భావిస్తోంది.....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ