Advertisementt

మరో చిన్నపాత్రను ఒప్పుకొన్న ఆదాశర్మ!

Mon 20th Apr 2015 06:27 AM
adah sharma,saidharamtej,director hareesh shankar,new movie,subrahmanyam for sale  మరో చిన్నపాత్రను ఒప్పుకొన్న ఆదాశర్మ!
మరో చిన్నపాత్రను ఒప్పుకొన్న ఆదాశర్మ!
Advertisement
Ads by CJ

‘హార్ట్‌ఎటాక్‌’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ఆదాశర్మ. అయితే ఆ చిత్రం తర్వాత ఆమెకు అనుకొన్న విధంగా చాన్స్‌లు రాలేదు. ఇటీవల అల్లుఅర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొంది విడుదలైన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రంలో ఆమె ఓ చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. కాగా ఆమె ఇలాగే మరో చిత్రంలో ఓ చిన్నపాత్రను చేయడానికి ఒప్పుకొందిట. చిన్న పాత్ర అయినప్పటికీ కథకు కీలకమైన పాత్ర కావడంతో తాను ఒప్పుకొన్నానని ఆమె చెబుతోంది. సాయిధరమ్‌తేజ్‌ హీరోగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రంలో ఆమె కనిపించనుంది. కానీ ఆ పాత్ర ఏమిటో మాత్రం తాను రివీల్‌ చేయనని, అలా చేస్తే హరీష్‌శంకర్‌ కోప్పడతాడని చెబుతోంది. మొత్తానికి చిన్న పాత్రలైనా కూడా తనకు గుర్తింపు తెచ్చేపాత్రలను చేయడానికి ఆమె అంగీకరిస్తుండటం ఆమెకు కలిసొస్తుందనే చెప్పాలి...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ