Advertisementt

తమన్‌కు బంపర్‌ ఆఫర్‌!

Mon 20th Apr 2015 05:03 AM
thaman,kollywood,kick 2,ramcharan,srinu vaitla  తమన్‌కు బంపర్‌ ఆఫర్‌!
తమన్‌కు బంపర్‌ ఆఫర్‌!
Advertisement
Ads by CJ

మొత్తానికి అదృష్టం అంటే అది తమన్‌దే అని చెప్పాలి. ఇప్పటికే తెలుగులో ఆయన ‘కిక్‌2’, రామ్‌చరణ్‌-శ్రీనువైట్ల చిత్రం, ‘పండగచేస్కో’ వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇక కోలీవుడ్‌లో అయితే ఆయన ఏకంగా ఐదు చిత్రాలకు పని చేస్తున్నాడు. ఇలా సౌత్‌ను ఓ ఊపు ఊపేస్తున్న తమన్‌కు తాజాగా బాలీవుడ్‌ నుండి పిలుపు వచ్చిందని సమాచారం. ఇంతకు ముందు దేవిశ్రీప్రసాద్‌కు బాలీవుడ్‌ అవకాశం ఇచ్చిన సల్మాన్‌ఖాన్‌ ఇప్పుడు తమన్‌కు కూడా అవకాశం ఇస్తున్నాడని తెలుస్తోంది. త్వరలో తాను నటించబోయే ‘కిక్‌2’ చిత్రానికి సంగీత దర్శకునిగా తమన్‌ పేరును సల్మాన్‌ ఖరారు చేశాడని తెలుస్తోంది. మొత్తానికి బంపర్‌ ఆఫర్‌తో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న తమన్‌ అక్కడ కూడా బిజీగా మారుతాడని ఆశిద్దాం...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ