Advertisementt

‘మా’ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

Mon 20th Apr 2015 01:49 AM
maa elections,maa new president,maa body swearing in,rajendra prasad  ‘మా’ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం
‘మా’ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం
Advertisement
Banner Ads

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, మరెంతో ఆసక్తికరంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో అధ్యక్షుడిగా డా॥ రాజేంద్రప్రసాద్‌ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్‌తోపాటు ఎన్నికైన మిగతా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. మాజీ అధ్యక్షుడు మురళీమోహన్‌ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో అధ్యక్ష స్థానంలో డా॥రాజేంద్రప్రసాద్‌ని కూర్చోబెట్టారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాగబాబు, రోజా, పరుచూరి వెంకటేశ్వరరావు, లక్ష్మీ మంచు, రాజీవ్‌ కనకాల, శివకృష్ణ, రఘుబాబు, తనికెళ్ళ భరణి, హేమ, ఉత్తేజ్‌, శివాజీరాజా, కాదంబరి కిరణ్‌కుమార్‌, ఏడిద శ్రీరామ్‌, తిలక్‌, నర్సింగ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

మురళీమోహన్‌: మన సినిమా పరిశ్రమ అనేది ఒక కుటుంబం. కొన్ని సందర్భాల్లో పోటీ పడినా మేమంతా కుటుంబ సభ్యులమే. సినీ పరిశ్రమ ఎటువంటి కార్యక్రమాల్లో అయినా సేవ చేయడానికి ముందుంటుందన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో మేం ఒకరినొకరం ఎన్ని మాటలు అనుకున్నా అవి ఎన్నికలకు మాత్రమే పరిమితం తప్ప మా మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్రప్రసాద్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజేంద్రప్రసాద్‌, కొత్తగా ఎన్నికైన ఇతర కార్యవర్గం అసోసియేషన్‌ అభివృద్ధికి కృషి చేయాలని, పేద కళాకారులకు చేయూత నివ్వాలని కోరుతున్నాను. 

నాగబాబు: ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి సోదరులు రాజేంద్రప్రసాద్‌, శివాజీరాజా, మిగిలిన సభ్యులకు నా శుభాకాంక్షలు. మురళీమోహన్‌గారు ‘మా’ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అయితే మార్పు అనేది అవసరం కాబట్టి మేం పోరాడాం. ఆయనంటే మాకు ఎప్పుడూ గౌరవమే. ఇప్పుడు ఎన్నికైన కొత్త అధ్యక్షుడు ‘మా’ను అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల ప్రకార పెన్షన్లు, హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ వంటి వాటి మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. వీటి కోసం మా కుటుంబం నుండి లక్ష రూపాయలు విరాళం అందిస్తున్నాం. వరుణ్‌తేజ్‌ పేరుమీద లక్ష రూపాయలు చెక్‌ ఇస్తున్నాను. అలాగే రామ్‌చరణ్‌,  అల్లు అర్జున్‌ రెండు లక్షల చొప్పున, సాయిధరమ్‌ లక్ష రూపాయలు ఇస్తున్నారు. ఈవారంలోనే దానికి సంబంధించిన చెక్కులను అందిస్తాను.

రాజేంద్రప్రసాద్‌: పేద కళాకారులకు ఏదైనా సహాయం చెయ్యాలి, ఒక మంచి పని చెయ్యాలని అనే ఆలోచనతో మీ ముందుకు వచ్చాం. పేద కళాకారుల పెన్షన్లకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. అది ఈరోజు నాగబాబుతో మొదలైంది. ఆయన మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాడు. అలాగే హౌసింగ్‌ కమ్యూనిటీ వారు ‘మా’ అభివృద్ధికి కోటి రూపాయలు విరాళం ఇస్తామన్నారు. విదేశాల్లోని మిత్రులు కూడా పేద కళాకారుల కోసం విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా వున్నారు. త్వరలోనే జనరల్‌ బాడీ మీటింగ్‌ ఏర్పాటు చేస్తాం. మరో ముఖ్య విషయం ఏమిటంటే కళాకారుల ఎంట్రీ ఫీజు కూడా తగ్గించాలని ఆలోచిస్తున్నాం.

Advertisement
Banner Ads

Loading..
Loading..
Loading..
Advertisement
Banner Ads