సీనియర్ హీరోయిన్లనే ఎంచుకుంటున్న కమల్...!
సాధారణంగా సినిమాఫీల్డ్‌లో హీరోల వయసును పెద్దగా పట్టించుకోరు. హీరోలకు 60ఏళ్ల వయసు వచ్చినా కూడా 16ఏళ్ల కుర్రహీరోయిన్లతో రొమాన్స్ చేస్తుంటారు. ఇది చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటున్నప్పటికీ ఆయా హీరోల ఇమేజ్, క్రేజ్ మూలంగా అవి చెల్లుబాటు అయిపోతున్నాయి. అయితే లోకనాయకుడు కమల్‌హాసన్ మాత్రం తన వయసుకు తగ్గట్లుగా సీనియర్ హీరోయిన్లను ఎంచుకుంటూ ముందుకు పోతున్నాడు. ‘విశ్వరూపం, ఉత్తమవిలన్, విశ్వరూపం2’ చిత్రాల్లో 38ఏళ్ల పూజాకుమార్‌తో కలిసి నటించాడు. ‘పాపనాశమ్’ చిత్రంలో గౌతమిని తీసుకున్నాడు. త్వరలో ఆయన నటించే మరో చిత్రం కోసం త్రిషను తీసుకున్నట్లు సమాచారం. ఇలా వయసుకు గౌరవం ఇస్తోన్న కమల్‌ను చూసి మిగతా వయసు మళ్లిన హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పకతప్పదు.