మెగాఫ్యామిలీ హీరోలలో మెగాస్టార్ చిరంజీవికి ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉండేది. ఇక పవన్‌కళ్యాణ్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక రామ్‌చరణ్‌తో పోలిస్తే అల్లుఅర్జున్‌కు కూడా కుటుంబ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. దీనికి ‘సన్నాఫ్ సత్యమూర్తి’నే తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. ఎటొచ్చి ఒక్క రామ్‌చరణ్‌కు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌లో పెద్ద క్రేజ్ లేదు. ఈ లోపాన్ని సరిచేసుకోవడంపై ఆయన ఇప్పుడు దృష్టి పెట్టాడు. ఇటీవల చేసిన ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంతో కాస్త ఫర్వాలేదనిపించుకున్నాడు. ఇక ఆయన తాజాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కూడా సిస్టర్ సెంటిమెంట్‌తో సాగనుందని, అలాగే ఫ్యామిలీ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా కూడా ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. సో... తన తాజా చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే పనిలో చరణ్ చెమటోడుస్తున్నాడు. తమ ఫ్యామిలీలోని మిగతా హీరోలలాగా కేవలం మాస్‌నే కాకుండా క్లాస్‌ను కూడా ఆయన టార్గెట్ చేస్తుండటం విశేషం...!