ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం రెండు భారీ చిత్రాలకై ఎదురుచూస్తోంది. అందులో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా వంటి భారీ తారాగణంతో రెడీ అవుతోన్న ‘బాహుబలి’ కోసం అయితే.,.. మరొక్కటి గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రుద్రమదేవి’ చిత్రం. రెండూ భారీ బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. ఒకటి కాల్పనికి చారిత్రక గాధా చిత్రం కాగా, మరొక్కటి రాణి రుద్రమదేవి చారిత్రక గాధ. ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో సోలోగా వచ్చి కలెక్షన్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయి. ‘రుద్రమదేవి’ చిత్రం ఆడియో విడుదలై 20రోజులు దాటుతున్నా కూడా ఈ చిత్రం విడుదలపై గుణశేఖక్ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. ఈ చిత్రం రీరికార్డింగ్‌ను ఇటీవలే ఇళయరాజా సారధ్యంలో లండన్‌లో పూర్తి చేశారు. కాగా ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోలు తప్ప ఈ చిత్రం ట్రైలర్స్‌గానీ, ఆడియో గానీ ఇప్పటికీ విడుదల కాలేదు. మే 15న విడుదల చేస్తామని రాజమౌళి చెప్పినప్పటికీ అది జరిగే పని కాదని తెలుస్తోంది ఈ చిత్రం గ్రాఫిక్స్‌తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు ఎక్కువ సమయం తీసుకొంటూ ఉండటంతో ఈ చిత్రం ప్రస్తుతానికి వాయిదా పడినట్లే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఎక్కువ ఆలస్యం చేయడం కూడా మంచిది కాదని, ఈ చిత్రాలు వేసవి సీజన్‌ను వదులుకుంటే చాలా నష్టపోతారని ట్రేడ్‌వర్గాలు హెచ్చరిస్తున్నాయి.