ప్రాఫిట్.. నిర్మాతలకు చాలా ఇష్టమైన పదం ఇది. ప్రతి నిర్మాత తన సినిమా విడుదలకు ముందు ప్రాఫిట్ రావాలని అనుకుంటాడు.. కాని ఇది చాలా తక్కువ మంది నిర్మాతలను వరిస్తుంటుంది. ఇటీవల ప్రాఫిట్‌తో విడుదలైన సినిమాల జాబితాలో తాజాగా దోచేయ్ కూడా చేరింది.
‘స్వామిరారా’ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించి నిర్మాతలకు లాభాల పంట పండించిన దర్శకుడు సుధీర్ వర్మ తన తాజా చిత్రం కూడా ‘దోచెయ్’ విషయంలో అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. కేవలం పదికోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాకు 15కోట్ల బిజినెస్ అయ్యిందని సమాచారం. సో.. విడుదలకు ముందే ‘దోచేయ్’ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌కు 5 కోట్ల లాభాన్ని అందించాడు దర్శకుడు సుధీర్‌వర్మ. అంతేకాదు ఈ సినిమా హిట్టయితే నిర్మాతకు కాసుల పంట పండినట్లే...!