మెగా కాంపౌండ్‌కు చెందిన ఏ హీరో సినిమా ప్రారంభం కావాలన్న దాదాపుగా మెగాస్టార్ చిరంజీవి అనుమతి తప్పనిసరి. ఒక్క పవన్‌కళ్యాణ్ మినహాయిస్తే మెగా కాంపౌండ్‌లో మిగత హీరోలు తమ సినిమాలు సెట్స్‌మీదకు వెళ్లేముందు మెగాస్టార్ చిరంజీవి అనుమతి తీసుకోవాల్సిందే..
గత కొంతకాలంగా చిరంజీవి రాజకీయాల్లో బిజీగా వుండటం వల్ల మెగా హీరోల్లో ఒక్క చరణ్ సినిమాలను తప్ప వేరే హీరోల సినిమాలు పట్టించుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఖాళీగా రిలాక్స్‌డ్‌గా వున్న చిరు ఇప్పుడిప్పుడే మెగాకాంపౌండ్‌కు చెందిన ఇతర హీరోలపై కూడా దృష్టిపెడుతున్నాడట. ఇందులో భాగంగానే బన్నీ తన తదుపరి చిత్రం సెట్స్‌మీదకు వెళ్లడానికి మెగాస్టార్ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నాడట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ నిర్మించబోయే ఈ చిత్రం మెగాస్టార్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తేనే వుంటుందని... లేకపోతే అంతేసంగతులని గుసగుసలు వినిపిస్తున్నాయి.