త్వరలో కీర్తిశేషులు డి.రామానాయుడు కలలు కన్న ఓ మల్టీస్టారర్ ప్రారంభం కానుంది. దగ్గుబాటి వంశానికి చెందిన బాబాయ్ వెంకటేష్‌తో పాటు రానా , నాగచైతన్యలు కూడా నటిస్తారని, దీనికి ‘నాయుడు గారి కుటుంబం’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సురేష్‌బాబు యోచిస్తున్నాడు. కాగా గతంలో రానా హీరోయిన్ త్రిషల మధ్య ఎఫైర్ ఉన్నట్లు పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ వారు మాత్రం తాము మంచి స్నేహితులమని చెప్పారు. త్రిషకు ఎంగేజ్‌మెంట్ జరిగిపోవడంతో ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. ఈ చిత్రంలో త్రిష కూడా నటించనుందని, అది కూడా బాబాయ్ వెంకటేష్ సరసన నటించనుందని సమాచారం.