మహేష్‌బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీమంతుడు’ (వర్కింగ్‌టైటిల్). కాగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించిన డైలాగులు లీకయ్యాయంటూ ఓ రెండు డైలాగులు సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ‘మనుషుల్లో మంచి పోయి క్రూరత్వమే మిగిలింది సార్...! అనే డైలాగ్‌తో పాటు ‘నీకు హెడ్ వెయిట్ ఉంటే... నాకు హ్యాండ్ వెయిట్ ఎక్కువ’ అనే డైలాగులు వినిపిస్తున్నాయి. మరి ఇవి నిజమో కాదో తెలియాంటే మరికొంత కాలం ఆగాలి...!