‘కార్తికేయ’ చిత్రంతో సంచలన విజయం సాధించిన దర్శకుడు చందు మొండేటి తన తర్వాతి చిత్రంగా నాగార్జునకు ఓ కథ చెప్పి ఓకే అనిపించుకోవాలనుకున్నాడట. కానీ నాగార్జున మాత్రం స్టోరీ అంతా విని, ప్రస్తుతం తాను బిజీగా ఉన్నానని, నాగచైతన్యతో ఓ సినిమా చేయమని, ఆ తర్వాత తనతో చేయవచ్చని తెలిపాడట. దీంతో తండ్రి కోసం వస్తే తనయుడి కాల్షీట్స్ దొరికాయట. మొత్తానికి మొదటి చిత్రంతో హిట్ కొడుతున్న యువ దర్శకులకు నాగచైతన్య, నాగార్జునలు పిలిచి మరీ అవకాశాలు ఇస్తుండటం విశేషం. ఈ విధంగా న్యూటాలెంట్‌కి అవకాశం ఇవ్వడంతో పాటు తమను సరికొత్తగా చూపించే సామర్ధ్యం ఉన్న దర్శకులకు అన్నపూర్ణ స్టూడియాస్ ఆలయంగా మారుతోంది.