అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ‘జులాయి’ చిత్రం సూపర్‌హిట్ అయిన విషయం తెలిసిందే. లేటెస్ట్‌గా మళ్ళీ అదే కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. విలువలే ఆస్తి అనే ట్యాగ్‌లైన్‌తో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఏప్రిల్ 9 న విడుదలయిన ఈ చిత్రానికి మొదటిరోజు మిశ్రమ ఫలితాలు వచ్చినా మంచి వసూళ్లను రాబట్టుకుంది.
ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పడానికి ఈ నెల 18 న హైదరాబాద్ శిల్పకళావేదికలో థాంక్స్ మీట్ ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా ఫ్యామిలీ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రానున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి రావాల్సిన పవన్ కొన్ని కారణాల చేత రాలేకపోయాడు. త్రివిక్రమ్ కి, పవన్ కు మధ్య ఉన్న స్నేహంతో త్రివిక్రమ్ పవన్ ను ఈ వేడుకకు రావాలని కోరగా ఆయన అంగీకరించారని తెలుస్తోంది. తాజాగా ఈ థాంక్స్ మీట్ వాయిదా పడిందని సమాచారం. పవన్ కళ్యాన్ కోసమే ఈ కార్యక్రమం వాయిదా వేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. మరి ఈ సారైనా పవన్ వస్తాడో లేదో చూడాలి..!