Advertisementt

అంజలి కి ఇంక తిరుగులేదు!

Thu 16th Apr 2015 08:16 AM
anjali,balakrishna,balakrishna 99th movie,vijay,puli  అంజలి కి ఇంక తిరుగులేదు!
అంజలి కి ఇంక తిరుగులేదు!
Advertisement
Ads by CJ

సినీ జీవితంలో ఇటీవల కాలంలో తెలుగింటి అమ్మాయి, టాలీవుడ్‌ సీతమ్మ అంజలి ఎదుర్కొనన్ని ఎత్తుపల్లాలు ఎవరు చూసివుండరు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆమె ఒక్కోసారి మెట్టుపై కెక్కడం... వెంటనే ఏదో ఒక వివాధంతో మరలా మెట్టు దిగడం... మరలా బౌన్స్‌ బ్యాక్‌ కావడం ఆమెకు నిత్యకృత్యమైపోయింది. తాజాగా ఆమె తెలుగులో  ఆమె ఓ రెండు చిత్రాల్లో నటిస్తోంది. బాలయ్య నటించే 99వ చిత్రంలో కూడా ఆమె ఓ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. ఇదే సమయంలో ఆమె తమిళంలో కూడా వరుస అవకాశాలు అందుకొంటోంది. జయం రవితో ఓ చిత్రం, విమల్‌తో ఓ చిత్రం చేస్తున్న ఆమె విజయ్‌ హీరోగా శృతిహాసన్‌, హన్సిక హీరోయిన్లుగా, శ్రీదేవి కీలకపాత్రలో నటిస్తున్న ‘పులి’ చిత్రంలో ఓ కీలకపాత్రను దక్కించుకొందని సమాచారం. ఈ చిత్రానికి శింబుదేవన్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ