అల్లుఅర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం ఓవర్‌సీస్‌లో మంచి కలెక్షన్లు రాబడుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అలాగే ఇక్కడ కూడా ఈ చిత్రం మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను, ‘ఎ’ సెంటర్లలోనూ మంచి ఊపు చూపుతోందని, అయితే మాస్ ప్రేక్షకులు అధికంగా ఉండే బి,సి సెంటర్లలో ఈ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఓవర్‌సీస్ ప్రీమియర్ షో వసూళ్ల విషయంలో పవన్‌కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం వసూళ్లను బ్రేక్ చేసిందని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. యుయస్‌ఎలో ఈ చిత్రం ఇప్పటికే మిలియన్ డాలర్ మార్క్‌ను దాటేసింది. యుఎస్‌ఏలో మిలియన్ మార్కు దాటిన బన్నీ రెండో చిత్రం కూడా ఇదే. బన్నీ నటించిన ‘జులాయి’ కూడా అక్కడ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది.