Advertisementt

ఆ దర్శక, హీరోయిన్ల నడుమ కోల్డ్‌వార్‌..!!

Wed 15th Apr 2015 08:45 AM
priyankachopra,madam ji,madhur bhandharkar  ఆ దర్శక, హీరోయిన్ల నడుమ కోల్డ్‌వార్‌..!!
ఆ దర్శక, హీరోయిన్ల నడుమ కోల్డ్‌వార్‌..!!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ అగ్ర దర్శకుడు మధుర్‌ బండార్కర్‌ కలల ప్రాజెక్టు ఓ కలలాగే మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాల్లో ఐటెమ్‌గర్ల్‌ స్థాయినుంచి దేశ రాజకీయాల్లోను శాసించే ఓ మహిళ జీవితం ఆధారంగా ఆయన 'మేడమ్‌ జీ' అనే చిత్రాన్ని రూపొందించడానికి చాన్నాళ్లుగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అటు.. ఇటు.. తిరిగి చివరకు ప్రియాంకచోప్రా చేతుల్లోకి వచ్చింది. ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పిన ఆమె నిర్మాణంలోనూ భాగస్వామిగా మారింది. ఇక అప్పటినుంచి బండార్కర్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఆమె అప్పటికే పలు సినిమాలను అంగీకరించి ఉండటంతో అవి పూర్తయ్యే వరకు బండార్కర్‌ వేచిచూశారు. ఇక ఆ సినిమాలు పూర్తవగానే ఆమె హాలీవుడ్‌లో సీరియల్స్‌లో నటించడానికి వెళ్లిపోయింది. దీంతో మరికొన్నాళ్లు మధుర్‌ వేచిచూశారు. ఎట్టకేలకు ఆమె అమెరికానుంచి తిరిగి రావడంతో సినిమా పట్టాలెక్కతుందని ఆశించిన బండార్కర్‌ ఆ మేరకు ఏర్పాట్లలో మునిగిపోయారు. అయితే మళ్లీ ప్రియాంక్‌ ఆయనకు షాక్‌నిచ్చింది. ఇప్పట్లో ఈ సినిమాకు డేట్లు కేటాయించలేనంటూ బాంబు పేల్చింది. దీంతో దిమ్మదిరిగి బండార్కర్‌కు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. ఇక ఆయన ఈ సినిమానుంచే పక్కకు తపుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి మధ్య ప్రస్తుతం కోల్డ్‌వార్‌ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా ఇక తెరకెక్కడం అనుమానమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ