Advertisementt

‘ఓకే బంగారం’ వాయిదా పడనుందా?

Wed 15th Apr 2015 05:36 AM
dil raju,ok bangaram movie,postpone  ‘ఓకే బంగారం’ వాయిదా పడనుందా?
‘ఓకే బంగారం’ వాయిదా పడనుందా?
Advertisement
Ads by CJ
ఒకవైపు మరో రెండు మూడు వారాలు గ్యాప్‌ వచ్చి, పోటీగా ఏ సినిమా కూడా రాకుండా ఉంటే మేలని ‘సన్నాఫ్‌సత్యమూర్తి’ యూనిట్‌ కోరుకుంటోంది. ఇక నిర్మాత దిల్‌రాజు కూడా నైజాం ఏరియాకు ‘సన్నాఫ్‌సత్యమూర్తి’ పంపిణీ హక్కులు పొందిన సంగతి తెలిసిందే. దీంతో తన చిత్రమే ... తాను పంపిణీ చేసిన చిత్రానికి పోటీగా రావడం ఆయనకు ఇష్టం లేదని, అందువల్ల మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘ఓకే బంగారం’ చిత్రాన్ని మణిరత్నం చేత ఎలాగైనా ఓ వారం అయినా వాయిదా వేయించాలనే ఆలోచనలో ఉన్నాడట దిల్‌రాజు. ‘ఓకే బంగారం’ చిత్రాన్ని స్వయాన దిల్‌రాజునే తెలుగులో విడుదల చేస్తుండటంతో ఈ సంకట పరిస్థితి దిల్‌రాజుకు ఎదురవుతోంది. అయినా ‘ఓకే బంగారం’ చిత్రం కేవలం తెలుగులోనే గాక తమిళ, మలయాళ భాషల్లో కూడా అదే తేదీన విడుదల కానుండటంతో ఒక్క తెలుగులో వాయిదా వేస్తే ఆ ప్రభావం ఇతర భాషల్లో కూడా ప్రభావం చూపుతుంది. మరి మణిరత్నం ఏం.. నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాల్సివుంది....!
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ